ములుగు జిల్లా నూగూరు, వెంకటాపురం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టు మిలీషియా దళసభ్యులు పేలుడు సామగ్రి అమర్చేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారం మేరకు అదే ప్రాంతంలో వెంకటాపూర్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలో ల్యాండ్ మైన్లు అమరుస్తోన్న మిలీషియా సభ్యులను వారు గమనించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు ఒక మిలీషియా సభ్యుణ్ని అరెస్టు చేశారు. అతని నుంచి పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై తెలిపారు.