మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేళాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు గోదావరిలోకి వెళ్లిన వ్యక్తి అందులో మునిగి మృతి చెందాడు. సోమగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ (30) అనే యువకుడు మహాశివరాత్రి సందర్భంగా వేళాలకు రెండు రోజుల క్రితం వచ్చాడు.
దర్శనం తరువాత మొక్కులు చెల్లిచుకుని రెండు రోజులు అక్కడే ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాజన్న సన్నిధిలో గంగవ్వ.. అభిమానులతో సెల్ఫీలు