ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన దస్తగిరి(55) అనే వ్యక్తిపై కొందరు కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. ఆదివారం రాత్రి ఇంటి వద్దకు వచ్చిన కొందరు.. మాట్లాడాలని బయటకు తీసుకెళ్లి చంపేశారని మృతుడి తల్లి, బంధువులు ఆరోపించారు. ఏపీ పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్ని మనసులో పెట్టుకుని హత్యకు పాల్పడ్డారని కన్నీరుమున్నీరుగా విలపించారు.
బాధితుల ఫిర్యాదుతో అనుమానితలపై కేసు నమోదు చేశామని కోడుమూరు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోడుమూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: వదినను చంపిన మరిది