ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన సయ్యద్ సంధాని.. రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి కడపకు వచ్చాడు. సంధానికి పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. మరోవైపు.. వారం క్రితం సంధాని కొందరితో గొడవపడ్డాడు. ఈ ఘటనతో ఆ వ్యక్తులు సంధానిని ఎలాగైనా చంపాలని కక్ష పెంచుకున్నారు.
కాగా.. సంధాని స్నేహితునికి కుమారుడు జన్మించడంతో వేడుక చేసుకునేందుకు వారు దేవుని కడప చెరువు వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సంధాని ప్రత్యర్థులు.. ఆ చెరువు వద్దకు వెళ్లి ఘర్షణ పడ్డారు. అతనిపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో సంధానికి 5 నుంచి 10 వరకు కత్తి పోట్లు పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన సంధాని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సునీల్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: SUICIDE ATTEMPT: పోలీస్ స్టేషన్ ఎదుటే దంపతుల ఆత్మహత్యాయత్నం