ETV Bharat / crime

కొడుకు పుట్టాలని రెండో పెళ్లి.. మొదటి భార్యతో కలిసి ఘాతుకం - man killed his second wife in rangareddy

Man Killed His Wife : ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే. మగపిల్లాడి కోసమని ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లాడాడు. ఎట్టకేలకు వారికి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆ మహిళ ఆస్తిలో వాటా కావాలని అడిగింది. ఆస్తిపై కన్నేసిందనే కోపంతో ఆ వ్యక్తి తన మొదటి భార్యతో కలిసి రెండో భార్యను హతమార్చాడు. అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసి చెరువులో పడేశారు.

Man Killed His Wife
Man Killed His Wife
author img

By

Published : Apr 21, 2022, 10:06 AM IST

Man Killed His Wife : పుత్రుడి కోసం మరో పెళ్లి చేసుకున్న భర్త.. బాబు పుట్టాక మొదటి భార్యతో కలిసి రెండో భార్యను అంతం చేశాడు. ఆస్తిలో వాటా కావాలని అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, మల్లాపూర్‌ తండా పంచాయతీ పరిధిలోని లోక్యాతండాలో బుధవారం చోటుచేసుకుంది. కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు, ఎస్సై శంకర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోక్యాతండాకు చెందిన కెతావత్‌ శ్రీనివాస్‌ (46), మంజుల (35) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పుత్ర సంతానం కోసం శ్రీనివాస్‌ ఇదే మండలంలోని చింతగట్టుతండాకు చెందిన సాలీ(21)ని మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఎకరం పొలం రాసిస్తానని ముందే ఒప్పుకొన్నాడు. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. బుధవారం ఉదయం సాలీ తండ్రి ముడావత్‌ లక్యా కుమార్తెను చూసేందుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో గూడూరు పంచాయతీ పరిధిలోని రామయ్య చెరువు వద్ద జనం గుమికూడి ఉండటం చూసి అక్కడికి వెళ్లాడు. చెరువులో తన కుమార్తె చనిపోయి కనిపించింది.

Man Killed His Wife
సాలీ(మృతురాలు)

చంపి చెరువులో పడేసి..

Man Killed His Second Wife : మూడు సంవత్సరాలు గడుస్తున్నా భూమి రాసివ్వకపోవడంతో ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చింతగట్టుతండాలోనే ఉండిపోయిన భార్యను ఈ నెల 18న భర్త లోక్యాతండాకు తీసుకొచ్చాడు. 19న రాత్రి శ్రీనివాస్‌ మంజులతో కలిసి సాలీని గొంతు నులిమి హత్య చేసి స్థానిక చెరువులో పడేశారు. నిందితులు కొత్తూరు పోలీస్‌ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనతో సాలీ బంధువులు శ్రీనివాస్‌ ఇంటిపై దాడి చేశారు. న్యాయం జరిగేవరకు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీయనివ్వలేదు. నిందితులను కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి.. అక్కడే పెద్దల సమక్షంలో బాబు పేరిట ఆస్తి పంపకానికి ఒప్పుకుంటున్నట్లు రాయించుకున్నారని సమాచారం. దీంతో సాయంత్రం శవాన్ని చెరువులో నుంచి బయటకు తీసి షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.