భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారిన ఓ వాగును దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తి ప్రవాహంలో పడిపోయాడు. బైక్‌పై వాగును దాటుతుండగా ప్రవాహం ధాటికి వాహనం నుంచి కింద పడ్డాడు. బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోయాడు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి శివారులోని మామిడి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ప్రవాహం ఉద్ధృతంగా ఉందని స్థానికులు చెప్పినా వినకుండా... ద్విచక్రవాహనంతో వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. రేజింతల్ వైపు నుంచి వచ్చిన వ్యక్తి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: Accident: ప్రయాణంలో ఉండగా ఊడిన బస్సు చక్రాలు..