నారాయణపేట జిల్లా బొమ్మన్పాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన హనుమంతు(35) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.
ఆయన ఎప్పటిలాగే ఆదివారం మధ్యాహ్నం కూడా చేపల వేటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. హనుమంతు మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్