సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప్పకు చెందిన లక్ష్మీనర్సయ్య... 12 సంవత్సరాల కిందట బతుకు దెరువు కోసం లింగంపల్లి పాపిరెడ్డి కాలనీకి వచ్చాడు. అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఆరేళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా భార్య నుంచి విడిపోయాడు.
అప్పటి నుంచి పటాన్ చెరు ప్రాంతంలో అడ్డా కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం ఎదురుగా ఉన్న ఓ దుకాణం ముందు ఆదివారం మూర్ఛ వ్యాధితో అనాథగా మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం