నిర్మల్ జిల్లా కేంద్రంలోని ద్యాగవాడ కాలనీలో విషాదం నెలకొంది. సురేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వృత్తిరీత్యా ప్లంబర్ అయిన సురేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో అతని భార్య 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంతకూ కాపురానికి రాకపోవడం వల్ల మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కాలనీలోని ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో బావిలోని మృతదేహాన్ని బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇవీచూడండి: పంట ఎండిపాయే... అప్పు పెరిగిపాయే... చావే దిక్కాయే!