జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాలలో బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా(33) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న అజీమియాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో సముద్రాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: లైవ్: భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవం