MURDER IN NIZAMABAD: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో అశోక్(45) అనే వ్యక్తి గురువారం హత్యకు గురైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
అసలేం జరిగిందంటే...
అశోక్‌కి కొంత కాలంగా ఇంటి ఎదురుగా ఉండే ముత్తన్నతో గొడవలు నడుస్తున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో గురువారం ఉదయం జరిగిన గొడవలో అతను పారతో ముత్తన్న తలపై బాధడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన అశోక్‌పై బాధితుడి తరఫు బంధువులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలించగా పరారీలో ఉన్నట్లు తెలిసింది.
సాయంత్రమే రహదారి పక్కన శవమై...
గురువారం సాయంత్రం రహదారి పక్కన తీవ్రగాయాలతో రక్తపుమడుగులో మృతి చెందిన అశోక్‌ని అటు వెళ్లే వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సీఐ ప్రతాప్, ఎస్ఐ శ్రీకాంత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముత్తన్న బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:Realtors Murder Case Updates : కాసేపట్లో కోర్టుకు రియల్టర్ల హత్య కేసు నిందితులు