ETV Bharat / crime

ప్రేయసి పెళ్లి జరుగుతుండగా.. ఫంక్షన్ హాల్ ఎదుట ప్రియుడి ఆత్మహత్యాయత్నం - హైదరాబాద్‌లో వ్యక్తి ఆత్మహత్య

ప్రేమించడం లేదని.. ప్రేమించి వేరే వాడిని పెళ్లాడుతోందని.. ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇలా రకరకాల కారణాలతో యువకులు వారు ప్రేమించిన అమ్మాయిలను చంపడమో లేక వారు చావడమో చేస్తూ బంగారంలాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించిన వాళ్లు లేకపోతే జీవితమే లేదన్న భావనలో కొంత మంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలా తన ప్రేయసికి వేరే అతడితో పెళ్లి జరుగుతోందని ప్రియుడు ఆ వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

man suicide attempt
man suicide attempt
author img

By

Published : Jul 1, 2022, 10:17 AM IST

ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడమే లేక వారి ప్రాణాలే తీసుకోవడమో చేస్తోంది నేటి యువత. తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని వివాహం జరుగుతున్న కల్యాణ మండపం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించాడో యువకుడు. ఈ ఘటన హైదరాబాద్​లోని లంగర్‌హౌస్ వద్ద చోటుచేసుకుంది.

నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ అశ్వక్‌(19) అదే ప్రాంతానికి చెందిన ఫాతిమా(19)ను ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న అశ్వక్ ఆ పెళ్లిని ఆపడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. అన్ని ప్లాన్‌లు విఫలమవ్వడంతో తన ప్రియురాలి పెళ్లి జరుగుతున్న కల్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు.

లంగర్‌హౌస్‌ రింగ్ రోడ్డు వద్ద ఉన్న మొఘల్ ఫంక్షన్‌ హాల్‌లో తన ప్రేయసి పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకుని కల్యాణ మండపం ముందు తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అశ్వక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.