ETV Bharat / crime

బాలికతో ఇన్​స్టాలో చాటింగ్​.. ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. చివరకు..! - Man arrested for threatening girl with obscene videos

Man harass girl: యువతి ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని హెచ్చరించాడు. పలువురికి ఆ వీడియోలను పంపాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

బాలికతో ఇన్‌స్టాలో చాటింగ్.. ఆపై వీడియోలతో బ్లాక్‌మెయిల్

author img

By

Published : Jul 12, 2022, 8:10 PM IST

Man harass girl: ఆమెకు ఇన్​స్టాలో పరిచయమయ్యాడు. వీడియోకాల్స్ చేసి బాలికను మాటల్లోకి దింపాడు. అలా ఆమె ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసి బెదిరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు...పోలీసులను ఆశ్రయించారు.

ఖమ్మం జిల్లాలో బాలికను అశ్లీల వీడియోలతో బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన సిద్దేశ్‌ను కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వేధిస్తున్న విషయంపై కారేపల్లి పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిని ఖమ్మం జైలుకు తరలించారు. యువకుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన బాలిక(13)కు హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న సిద్దేశ్ ఇస్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో వాట్సాప్ ద్వారా ఛాటింగ్, వీడియో కాల్స్ చేసేవాడు. బాలికను మభ్యపెట్టి ఆమె వీడియోలను రికార్డు చేశాడు. ఆ తర్వాత అతని అసలు విషయం బయటపడింది. తనకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే.. వీటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. బాలికకు మరికొందరికి ఈ అశ్లీల వీడియోలను పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశఆరు. వారి ఫిర్యాదు మేరకు సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అతనికి సహకరించిన వారిని గుర్తించి.. వారిపై కూడా కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో బాలికకు సెల్‌ఫోన్‌ను.. కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా యువకుడు బాలికకు పరిచయమై.. ఇంతటి దారుణానికి దారితీసింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.