ETV Bharat / crime

భార్యను వ్యభిచారం చేయాలని భర్త ఒత్తిడి.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలోని విశాఖలో పలువురు మహిళలను వేధిస్తున్న అరుణ్ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో విశాఖ పోలీసులు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

crime news, regular groom
arun kumar, visaka groom
author img

By

Published : Apr 1, 2021, 2:03 PM IST

విశాఖలో సంచలనం రేపిన నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలకు వల వేసి వారిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న మోసగాడి ఉదంతం నిన్న వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో విశాఖ పోలీసులు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు అరుణ్‌కుమార్‌ పెళ్లి పేరుతో ఎంతమందిని మోసం చేశాడనే వివరాలు రాబడుతున్నారు. నిందితుడి నుంచి వచ్చిన సమాచారం మేరకు బాధితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్‌ కుమార్‌ చేతిలో మోసపోయిన వారు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈకేసులో ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధిత మహిళల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

నిందితుడి చరవాణి ఆధారంగా లభ్యమైన వివరాలు పరిశీలిస్తున్నారు. వ్యభిచారం, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ భర్త అనుమానాస్పద మృతి కేసులోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అరుణ్‌కుమార్‌ ఇంటిలో మారణాయుధాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఇతనికి ఎవరి సహకారం ఉండేదనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు అందినా నిర్లక్ష్యం వహించిన పోలీసుల పాత్రపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇవీ చూడండి: 'ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ తర్వాత వ్యభిచారానికి ఒత్తిడి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.