రోజూ ఆటోలో పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్... తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. ఆమెకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అతడి వలలో పడిపోయిన 14 బాలిక చివరికి అతడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఇద్దరు పిల్లలున్న అతడు వారిని అనాథలు చేయడమే కాకుండా.. బాలిక బలవన్మరణానికి కారణమై ఆమె కన్నవారిని కడుపుకోతకు గురిచేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (bhadradri kothagudem district) అశ్వారావు పేట బస్టాండ్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న బస్సులో ఇద్దరు వాంతులు చేసుకున్నారు. వారిని గమనించిన డ్రైవర్ అంబులెన్సుకు సమాచారం అందించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు (lovers suicide in bhadradri kothagudem). కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
![మృతుడు జగ్గారావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-05-16-prema-janta-atmahatya-ts10088_16112021180237_1611f_1637065957_212.jpg)
ఇదీ జరిగింది...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడేనికి చెందిన పొరల్లా జగ్గారావు (29) ఆటో డ్రైవర్గా (auto driver jagga rao) పనిచేస్తున్నాడు. చుండ్రుగొండ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తగరతి చదువుతున్న బాలిక (14) రోజు తన ఆటోలో తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలో దించాడు. అప్పటికే భార్య ఇద్దరు పిల్లలు ఉన్న జగ్గారావు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతడి మాయలో పడిపోయిన బాలిక అతడు చెప్పినట్లు చేసింది.
పురుగుల మందు తాగి బస్సు ఎక్కి
సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. ఆమెను వేరే ఊరికి తీసుకెళ్లిన జగ్గారావు.. మంగళవారం సాయంత్రం అశ్వారావుపేటలో కొత్తగూడెం వెళ్లే బస్సు ఎక్కారు. అప్పటికే పురుగుల మందు తాగిన వారిద్దరు బస్సులో వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
గతంలోనే పలు ఆరోపణలు
కాగా తమ బిడ్డను ఆటో డ్రైవర్ జగ్గారావు కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం చంద్రుగొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్న జగ్గారావు గతంలో కూడా ముగ్గురు బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లై పిల్లలున్నా అతడు మరో బాలికను వలలో వేసుకోవడమే కాక.. ఆమె మృతికి కారణమయ్యాడు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జగ్గారావు మృతితో అతడి భార్యా బిడ్డలు రోడ్డున పడ్డారు.
ఇదీ చూడండి: Robbery Murder: కదిరిలో దొంగల బీభత్సం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి దారుణ హత్య