ETV Bharat / crime

పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? - AP crime news

Lovers Suicide Attempt: వారిద్దరూ ప్రేమించుకున్నారు.పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు తిరస్కరించారు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడ ట్విస్ట్​ ఏంటంటే.. వారిద్దరికి ఇదివరకే వేర్వేరుగా పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు..!

Lovers Suicide Attempt
Lovers Suicide Attempt
author img

By

Published : Dec 27, 2021, 8:31 AM IST

Lovers Suicide Attempt: ఏపీలోని అనంతపురం జిల్లా ఉప్పారపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, చిన్నకుంట గ్రామానికి చెందిన మహిళకు ఇటీవల పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ వారిరువురికి అప్పటికే వేర్వేరుగా పెళ్లై... పిల్లలు కూడా ఉన్నారు. వారి 'అనైతిక బంధాన్ని' సమాజం ఒప్పుకోదని తెలిసినా చాటు మాటుగా కలుసుకునేవారు.

ప్రేమ మైకంలో కళ్లు మూసుకుపోయి..

వీరి వ్యవహారం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు గట్టిగా మందలించారు. వారు చేస్తున్నది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ వారి చెవికెక్కలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. ఇక ఎప్పటికీ కలిసి బతకలేమని... చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ మైకంలో కళ్లు మూసుకుపోయి పవిత్రమైన పెళ్లి బంధాన్ని కాదనుకున్నారు. కన్న బిడ్డలనూ వద్దనుకున్నారు. ఆ క్రమంలోనే.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో సదరు వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: గడప మీదే ప్రాణాలు వదిలిన మహిళ.. రెండ్రోజులకు గుర్తించిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.