Lovers Jumped Into Canal in Huzurabad :
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వద్ద కాకతీయ కాల్వలో ఓ ప్రేమజంట దూకింది. అటుగా వెళ్తున్న వారు ఈ ఘటన చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈతగాళ్లతో వాకి కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాల్వలోకి దూకింది తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక, డిగ్రీ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. కాకతీయ కాల్వకు నీరు నిలిపివేసి వారి కోసం గాలిస్తున్నారు.