ETV Bharat / crime

పెళ్లైనా మరవలేక ప్రేమికుడితో కలిసి వివాహిత ఆత్మహత్య - Lovers commits suicide in yadadri

ఆమెకు పెళ్లయి మూడేళ్లు.. వివాహానికి ముందు ప్రేమ... ప్రేమించిన వాడిని మరవలేకపోయింది. ఇటు భర్తతో ఉండలేక... అటు ప్రేమించిన వాడిని మరవలేకపోయింది. మరోవైపు ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో వివాహం... ఎడబాటు భరించలేక... ఇరువురు కలిసి రైల్వే ట్రాక్‌పై పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

Lovers commits suicide in bahupet railway track in yadadri district

author img

By

Published : Nov 9, 2022, 4:24 PM IST

గూడ్స్ రైలు కింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడుతల వెంకటేష్ కుమారుడు గణేశ్‌ (25), అదే గ్రామానికి చెందిన తోట లక్ష్మి కుమార్తె నలంద (23)గా గుర్తించారు. నలందకు మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన యాదగిరితో వివాహం జరిగింది. మృతురాలి భర్త యాదగిరిగుట్ట దేవస్థానంలోని లడ్డు తయారీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లికి ముందే నలందకు గణేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో యాదగిరి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం బహుపేట పరిధిలోని రైల్వే ట్రాక్‌ వద్ద మృతదేహాలు పడి ఉండడంతో గమనించిన సిబ్బంది.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాదగిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. నలంద, గణేశ్‌ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.