ETV Bharat / crime

Youngster Attack Girlfriend: మరో వ్యక్తితో నిశ్చితార్థం.. యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో 18 చోట్ల... - crime news today

Youngster Attack Girlfriend
Youngster Attack Girlfriend
author img

By

Published : Nov 10, 2021, 5:58 PM IST

Updated : Nov 10, 2021, 10:53 PM IST

17:54 November 10

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి

హైదరాబాద్‌ ఎల్బీనగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. వెంటనే బాధితురాలిని హస్తినాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె శిరీష పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని నెలలుగా ప్రేమాయణం..

బాధితురాలు, నిందితుడు ఒకే మండలం సమీప గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన యువతికి.. సమీప గ్రామానికి చెందిన బసవరాజుతో కొన్ని నెలల కింద పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరు నగరానికి వచ్చి వేర్వేరుగా నివాసముంటున్నారు. బస్వరాజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు అడపాదడపా కలుసుకుంటూ.. ప్రేమలో కొనసాగుతున్నారు.

ఇంట్లో అమ్మాయికి నిశ్చితార్థం..

ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. కారణమేదైనా.. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. అక్కడితో ఆగకుండా.. మూడు నెలల క్రితం వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. అమ్మాయి తమ ఇంట్లో ఉంటే.. బసవరాజు​ వచ్చి గొడవ చేస్తాడని ఆమె తండ్రి భావించాడు. నెల క్రితం తమ తమ్ముడి ఇంట్లో కూతురుని ఉంచాడు.

చావు బతుకుల మధ్య..

తన ప్రియురాలిని వేరే ఇంటికి తరలించారన్న వార్త తెలుసుకుని.. ఆమె ఉంటున్న ఇంటి చిరునామా కోసం బసవరాజు​ తీవ్రంగా వెతికాడు. మొత్తానికి ఆమె చిరునామా కనుక్కున్నాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై కోపంతో.. కర్కషంగా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి కడుపు, వెన్నులో పొడిచాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు వాటిలో.. ఆరు ప్రదేశాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధితురాలు కోలుకునేందుకు శ్రమిస్తున్నామని.. 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు చెబుతున్నారు.

 పెద్దపల్లిలోనూ ఇదే తరహా ఘటన..

ఇదే తరహాలో.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లిలోనూ ఓ ప్రేమోన్మాది కత్తిపీటతో తన ప్రియురాలి గొంతుకోశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ఈ క్రైం ప్రేమ కథలో ఏం జరిగిందో తెలియాలంటే.. ప్రేమికుడి ఘాతుకం.. కత్తిపీటతో ప్రియురాలి గొంతుకోసి హత్య  క్లిక్​ చేయండి.

Last Updated : Nov 10, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.