ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రఘువర్ధన్ రెడ్డి అనే లైన్‌మెన్ మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మాధారం గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బాధితున్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మండల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమతు చేస్తుండగా కరెంట్ సరఫరా కావడంతో విద్యుతాఘాతానికి గురై రఘువర్ధన్ రెడ్డి ప్రాణాలొదిలాడు. మృతుడు పదిహేనేళ్లుగా విద్యుత్ శాఖలో ఒప్పంద పద్ధతిలో పని చేస్తుండగా.. రెండేళ్ల క్రితం ఆర్టీజన్ ఉద్యోగిగా రెగ్యూలర్ అయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రఘువర్ధన్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: ఒకే చున్నీకి ఉరేసుకుని ప్రేమికుల బలవన్మరణం!