ETV Bharat / crime

Ganja Seized: భారీగా గంజాయి రవాణా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​ - హైదరాబాద్ తాజా నేర వార్తలు

Ganja Seized: గంజాయి రవాణాపై రాష్ట్ర పోలీసు శాఖ ఉక్కుపాదం మోపింది. తాజాగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 358 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

DCP Sun Preet Singh
ఎల్బీనగర్ డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్
author img

By

Published : May 11, 2022, 6:01 PM IST

Ganja seized: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్ వెల్లడించారు.

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర ముఠాలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఎల్బీనగర్ డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్ తెలిపారు. వారు జహీరాబాద్​కు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఏపీ నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. వీరితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలియచేశారు.

Captured suspects
పట్టుబడిన నిందితులు

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అర్జున్​కి ఏపీలోని గంజాయి సరఫరాదారులతో పరిచయాలు ఉన్నాయి. అక్కడి నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఏపీ నుంచి హైదరాబాద్​కు కారులో గంజాయి తీసుకువస్తుండంగా పోలీసుల తనిఖీల్లో నిర్వహించారు. కారులో ఉన్న 358 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.87లక్షల విలువైన 358కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్​లు, కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. నిందితులపై పీడీయాక్ట్ పెట్టనున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ ​ప్రీత్ సింగ్ తెలియచేశారు.

ఇదీ చదవండి: ఆ ఇంట్లో అర్ధరాత్రి రక్తపాతం.. దంపతుల దారుణ హత్య

ఎయిర్​పోర్ట్​లో 62 కిలోల హెరాయిన్​ సీజ్​.. విలువ రూ.430 కోట్ల పైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.