బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. నిందితుడు లతీఫ్‌ను అరెస్ట్ చేశారు.
సీపీ ఆదేశాలతో విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ, సిబ్బంది బోధన్ పీఎస్ పరిధి సమీపంలోని ఓ ఇంట్లో సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన గుట్కా, జర్దాను పట్టుకున్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. ఒకరు అరెస్ట్