lady dancer complaint on ex lover: మద్యం మత్తులో ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్యంగా రికార్డ్ చేసి.. స్నేహితులకు పంపాడని మాజీ ప్రియుడిపై ఓ డాన్సర్ ఫిర్యాదు చేసింది. బంగాల్‌కు చెందిన మహిళా డ్యాన్సర్‌కు ఓ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన సచిన్ అనే ఫిట్నెస్ ట్రైనర్ పరిచయమయ్యాడు. వారి మధ్య ఏర్పడ్డ స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. 2014 నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా కాలం వరకు వారి ప్రేమాయణం బాగానే నడిచింది. రానురాను యువతిని సచిన్ శారీరకంగా వేధించటం మొదలుపెట్టాడు.
సచిన్ ప్రవర్తన నచ్చకపోవటంతో.. కొన్నేళ్లుగా యువతి సచిన్‌కి దూరంగా పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటోంది. కాగా.. రెండేళ్ల క్రితం పంజాగుట్టలోని ఆమె నివాసానికి సచిన్ వచ్చాడు. ఆమెతో కలిసి మద్యం సేవించాడు. మత్తులో ఇద్దరు ఏకాంతంగా గడిపారు. వాళ్లు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఆమెకు తెలియకుండా చరవాణిలో రికార్డ్ చేశాడు. మళ్లీ.. అప్పటి నుంచి ఇద్దరు విడిగానే ఉంటున్నారు.
అయితే.. సచిన్‌తో ఏకంతంగా గడిపిన వీడియోలు తాజాగా సదరు యువతి స్నేహితుల వద్దకు చేరాయి. ఆ వీడియోల గురించి తెలిసి వెంటనే సచిన్‌కు ఫోన్ చేయగా.. స్పందన లభించలేదు. ఇక చేసేదేమీలేక.. సచిన్‌పై పంజాగుట్ట ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సచిన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: