వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ తులసీబార్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మూడు అంతస్థుల భవనంలో ఉన్న సామాన్లను కార్మికులతో తరలిస్తుండగా.. విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. రాజేశ్ అనే కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
మిగతా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి తలపై కొట్టి యువతిపై అత్యాచారం