ETV Bharat / crime

విషాదం: ఈతకు వెళ్లిన బాలురు.. ఇంటికి తిరిగి రాలేదు..! - ఆంధ్రప్రదేశ్​ వార్తలు

కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఏపీలోని అమరావతిలో చోటు చేసుకుంది. ప్రవాహం అధికంగా ఉండడంతో నీటిలో చిక్కుకుని ప్రాణాలు విడిచారు.

kids-death-in-amaravathi-guntur-district
విషాదం: ఈతకు వెళ్లిన బాలురు.. ఇంటికి తిరిగి రాలేదు..!
author img

By

Published : Mar 11, 2021, 12:41 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయం సమీపంలో విషాదం జరిగింది. కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అమరావతి బండచేనుకాలనీకి చెందిన పఠాన్ బాజీ (9) , పఠాన్ మీరా (13)... బుధవారం సాయంత్రం కృష్ణా నదిలో స్నానానికి దిగారు.

ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా.. నీటిలో చిక్కుకున్నారు. ఈత రాని ఆ చిన్నారులు.. నదిలో గల్లంతయ్యారు. గురువారం మృతదేహాలు నదిలో తెలియాడుతూ కనిపించాయి. చిన్నారుల మృతదేహాలను జాలర్లు వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.