ETV Bharat / crime

ఆదిలాబాద్‌కు కర్నాల్‌ ఉగ్ర నిందితులు

ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్‌ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులు అమన్‌దీప్‌ సింగ్‌, గురుప్రీత్‌ సింగ్‌లను కోర్టు అనుమతితో ఆదిలాబాద్​కు తీసుకురానున్నారు. ఆయుధాలను ఆదిలాబాద్​లో ఎక్కడ అప్పగించాలనుకున్నారన్న విషయంపై ఆరా తీయనున్నారు.

ఆదిలాబాద్‌కు కర్నాల్‌ ఉగ్ర నిందితులు
ఆదిలాబాద్‌కు కర్నాల్‌ ఉగ్ర నిందితులు
author img

By

Published : May 19, 2022, 9:33 AM IST

ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్‌ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్‌, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్‌ సింగ్‌, గురుప్రీత్‌ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పంజాబ్‌ నుంచి ఆయుధ సామగ్రిని ఆదిలాబాద్‌కు తరలించే క్రమంలోనే వీరు చిక్కిన నేపథ్యంలో.. ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. వారిని ఆదిలాబాద్‌ తీసుకొచ్చి ఎక్కడ ఆయుధాలను అప్పగించాలనుకున్నారన్న విషయంపై ఆరా తీయనున్నారు. వాస్తవానికి ఆయుధాలను ఆదిలాబాద్‌లో ఎవరికి అప్పగించాలనే విషయం నలుగురు నిందితులకు సైతం తెలియదని పోలీసులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌ నుంచి రింధా కేవలం ఆదిలాబాద్‌ లొకేషన్‌ను మాత్రమే వాట్సప్‌ ద్వారా షేర్‌ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆధారాలేమైనా దొరుకుతాయా అనే ఉద్దేశంతో అక్కడికి నిందితులిద్దరినీ తీసుకురానున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో సేకరించిన సమాచారం మేరకు గత 6 నెలలుగా కర్నాల్‌ నిందితులకు సుమారు రూ.22 లక్షల హవాలా సొమ్ము అందినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

ఇవీ చూడండి..

ఆదిలాబాద్​లో ఆయుధాల డంపింగ్.. ఈ జిల్లానే ఎంచుకోవడానికి కారణమేంటంటే..?

సరిహద్దుల్లో ల్యాండ్​మైన్ల పేలుళ్లు... అసలు ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.