కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం లైన్గూడ(Father killed Infant) లో సోమవారం రాత్రి జరిగిన ఒక అమానవీయ ఘటన గ్రామస్థులను, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన పట్ల కన్నీళ్లు రాల్చిన వారే కాని.. కలత చెందని వారు లేరు. మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని.. నెలల పసికందు ఉసురు తీసుకున్న తండ్రి(Father killed Infant) ని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగజ్ నగర్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ కరుణాకర్ వెల్లడించారు.
మళ్లీ ఆడపిల్లే అని
లైన్గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు, మానసబాయిలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు(Father killed Infant) సంతానం. పెద్ద కుమార్తెకు ఐదేళ్లు, చిన్న కుమార్తెకు రెండేళ్లు. 37 రోజుల క్రితం మూడో సంతానం కూడా ఆడపిల్ల(Father killed Infant) పుట్టింది. ఈ క్రమంలో ఈసారి కూడా అమ్మాయే పుట్టిందనే కోపంతో బాపురావు.. తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. మొన్న రాత్రి భార్యతో గొడవపెట్టుకుని ఆమెను కొట్టాడు. దీంతో మానసబాయి భయంతో ఊరిపెద్ద ఇంటికి వెళ్లి తలదాచుకుంది.
రిమాండ్కు తరలింపు
కోపోద్రిక్తుడైన బాపురావు ఇంట్లో ఉన్న పసికందును తీసుకువచ్చి సీసీ రోడ్డుపై(Father killed Infant) పడేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద బండరాయిని తలపై ఎత్తేశాడు. దీంతో ఆచిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఊరి పెద్దమనిషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ కరుణాకర్ తెలిపారు.
ఇదీ చదవండి: Father killed Infant: మూడోసారి ఆడపిల్లే అని.. కన్న తండ్రే కాలయముడై.. చివరకు