ETV Bharat / crime

disha encounter case: 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?' - తెలంగాణ వార్తలు

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో(disha encounter case) జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. సాక్షులు చెబుతున్న సమాధానాల పట్ల కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న సీఐ లాల్​మదార్, కానిస్టేబుల్ సిరాజుద్దీన్​లపై ప్రశ్నల వర్షం కురిపించింది.

disha encounter case, Justice sirpurkar commission
దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసు, జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్
author img

By

Published : Oct 29, 2021, 10:48 AM IST

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో(disha encounter case) జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణలో భాగంగా... సాక్షులు చెబుతున్న సమాధానాల పట్ల కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న సైబరాబాద్‌ సీఐ లాల్​మదార్, కానిస్టేబుల్ సిరాజుద్దీన్​లను గురువారం ప్రశ్నించింది. ఎన్​కౌంటర్ తర్వాత మృతదేహాలపై గాయాలను పరిశీలించారా? అని కమిషన్ ప్రశ్నించగా... లేదని లాల్​మదార్ సమాధానమిచ్చారు. 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?' అని అసహనం వ్యక్తం చేసింది.

ఎన్​కౌంటర్ జరిగిన తర్వాత ఎంత సమయం అక్కడ ఉన్నారని సిర్పూర్కర్ కమిషన్ అడిగిన ప్రశ్నకు... రాత్రి 8.30 గంటల వరకు ఉన్నామని లాల్​మదార్ సమాధానమిచ్చారు. సెల్​ఫోన్ల లొకేషన్‌ నార్సింగి, గ్రేహౌండ్స్‌ యూనిట్‌, శంషాబాద్‌ ప్రాంతంలో ఉన్నట్లు చూపించింది కదా అని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్ ప్రశ్నించగా... ఎన్​కౌంటర్ అనంతరం ఉన్నతాధికారులు తమ సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకొని ఘటనాస్థలానికి దూరంగా ఉంచారని సీఐ బదులిచ్చారు.

ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

‘దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ (Sirpurkar Enquiry on Disha Encounter case) ఉదంతంపై అబ్దుల్‌ రవూఫ్‌ అనే ప్రత్యక్ష సాక్షి (Sirpurkar Commission Enquiry) జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) ఎదుట గతంలో వాంగ్మూలమిచ్చారు. కమిషన్‌ తరఫు న్యాయవాదులు పరమేశ్వర్‌, విరూపాక్ష గౌడ అడిగిన ప్రశ్నలకు రవూఫ్‌ సమాధానాలిచ్చారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువులను దాచిన ప్రాంతాన్ని చూపిస్తానని నిందితుడు ఆరిఫ్‌ చెప్పడంతో పోలీసుల వెంట తానూ చటాన్‌పల్లికి వెళ్లానని చెప్పారు. వస్తువుల్ని వెతికే క్రమంలో ఆరిఫ్‌ రెండు చేతులతో మట్టి విసరడంతో 12 మంది కళ్లలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు సీఐ, ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంతమంది పోలీసులు నిందితుల్ని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్లలో మట్టి పడటంతో గమనించలేదని రవూఫ్‌ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరెంత దూరంలో ఉన్నారు.? అని అడిగితే 3-4 అడుగుల దూరంలో ఉన్నానని బదులిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఘటనాస్థలి ఫొటోలను చూపించి ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టమని అడిగారు. నిందితుల వాంగ్మూలంలో లేని విషయాలు.. మీ స్టేట్‌మెంట్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించగా, దానిని ఎలా నమోదు చేసుకున్నారో తనకు తెలియదని అన్నారు.

సజ్జనార్​పై విచారణ

'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ను కమిషన్​ ఇదివరకే విచారించింది. ​ కమిషన్​ సభ్యులు అడిగి ప్రశ్నలకు సజ్జనార్ సమాధానమిచ్చారు. దిశ హత్యాచార ఘటన గురించి శంషాబాద్ డీసీపీ తనకు చెప్పాడని.. కేసును అతనే పర్యవేక్షించాడని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిర్పుర్కర్ కమిషన్​కు వివరించారు. నిందితులను గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని.. కేసు పురోగతి గురించి శంషాబాద్ డీసీపీ ప్రతి రోజు ఉదయం జరిగే సెట్ కాన్ఫరెన్స్​లో చెప్పాడని సజ్జనార్ కమిషన్​కు తెలిపారు. ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా 2019 నవంబర్ 29న శంషాబాద్ విమానాశ్రయం వరకు వెళ్లి వస్తుంటే.. అదే రోజు నిందితులను పట్టుకున్న విషయాన్ని డీసీపీ చెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు మీడియాకు తెలిపానని కమిషన్ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానమిచ్చారు. దిశ నిందితులను పోలీసుల కస్టడీకి ఇచ్చే సమయంలో పరిగణలోకి తీసుకున్న అంశాల గురించి ప్రశ్నించగా.. న్యాయమూర్తి శ్యాంప్రసాద్ రావు సమాధానాలిచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.