హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పుణెలో ఓ వివాహానికి వెళ్తుండగా సంజయ్ కుమార్ అగర్వాల్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోల్‌కతా కోర్టులో హాజరు పరిచారు. సంజయ్ కుమార్ అగర్వాల్‌ను కోల్‌కతా కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆయనపై కోల్‌కతా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ పెండింగులో ఉంది. మూడేళ్ల క్రితం సంజయ్ కుమార్ అగర్వాల్, ఆయన కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌పై కోల్‌కతాలో డీఆర్ఐ కేసు నమోదు చేసింది.
ఎగుమతుల పేరిట ఎంఎంటీఎస్, డైమండ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సుంకం మినహాయింపు ఉన్న బంగారం దిగుమతి చేసుకున్న సంజయ్ కుమార్ అగర్వాల్.. అక్రమంగా దేశీయంగా చెలామణి చేసినట్లు అభియోగం. డీఆర్ఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా ఈడీ అధికారులు.. గతంలో ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను అరెస్టు చేసింది. సుమారు 54 కిలోల బంగారం, 25 కోట్ల రూపాయల విలువైన మూడు స్థిరాస్తులు, బ్యాంకుల్లోని 56 లక్షల రూపాయలను ఈడీ ఇప్పటికే తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్ ముందస్తు బెయిల్‌ను ఇటీవల కలకత్తా హైకోర్టు కొట్టివేసింది.
ఇదీ చూడండి: Gold seized: క్యాటరింగ్ ఉద్యోగి వద్ద కోటి రూపాయల బంగారం పట్టివేత