ETV Bharat / crime

kidnappers Warning : 'రూ.15 లక్షలిస్తేనే మీ నాన్నని వదిలిపెడతాం' - ముంబయిలో జగిత్యాల వాసి కిడ్నాప్‌

Kidnappers Warning : ముంబయి నగర శివారులో కిడ్నాప్ అయిన జగిత్యాల జిల్లా వాసి శంకరయ్య ఆచూకీ ఇంకా దొరకలేదు. కొందరు ఆగంతకులు శంకరయ్య కాళ్లు చేతులు కట్టేసి బందీగా ఉంచిన ఫొటోను వాట్సాప్‌లో అతడి కుమారుడికి పంపించారు. రూ.15 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని బెదిరించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కణ్నుంచి తెచ్చేదని ఆ కుటుంబం కన్నీరు పెడుతోంది. తన తండ్రిని రక్షించాలని పోలీసులను శంకరయ్య కుమారుడు వేడుకున్నాడు.

kidnappers Warning
kidnappers Warning
author img

By

Published : Jul 1, 2022, 9:12 AM IST

Kidnappers Warning : ముంబయి విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో ఆ నగర శివార్లలో జూన్‌ 22న అపహరణకు గురైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. ఆగంతకులు గురువారం కాళ్లు, చేతులు కట్టేసి శంకరయ్యను బందీగా ఉంచిన ఫొటోను వాట్సాప్‌లో ఆయన కుమారుడు హరీశ్‌కు పంపించారు. అనంతరం ‘రూ.15 లక్షలు ఇస్తేనే వదిలిపెడతాం. మీరు ఎక్కడికి డబ్బులు తెచ్చిస్తారో చెప్పండంటూ’ ఇంటర్‌నెట్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ హరీశ్‌ను బెదిరించారు.

కిడ్నాప్‌నకు గురైన శంకరయ్య

దాంతో బాధిత కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కణ్నుంచి తెచ్చివ్వగలమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అపహరించిన వారు తన తండ్రిని చంపేస్తారేమోననే భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ముంబయిలో కేసు నమోదైందని, అక్కడి పోలీసులు ఓ బృందాన్ని నియమించినప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.