తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి. అదీ సులభంగా డబ్బు ఖాతాలోకి రావాలి. ఇలా ఆశపడేవారే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. అధిక మొత్తంలో లాభాలంటూ..... ఆకర్షణీయ ప్రకటనలతో లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. గృహిణులు, విద్యావంతులు లక్ష్యంగా మోసాలు చేస్తున్నారు. అమెజాన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం...రోజుకు 10వేలకు సంపాదన అంటూ వచ్చిన సందేశానికి స్పందించిన చందానగర్‌కు చెందిన ఓ యువకుడు 2లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలంటూ.... హెచ్పీజడ్యాప్లో పెట్టుబడులు పెట్టిన సుచిత్రవాసి.... 6లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. షాపింగ్ చేస్తే కమీషన్లు వస్తాయంటూ వచ్చిన ప్రకటనతో.... రాజేంద్రనగర్‌కు చెందిన మహిళ రెండున్నర లక్షలు బూడిదపాలు చేసుకుంది.
చివరికి పోలీసుల వద్దకు
షాప్ నౌ అనే యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న మహిళ నగదు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఇటీవల జంటనగరాల పరిధిలో ఈ తరహా కేసులు అధికమయ్యాయి. ఉన్నత చదువులు చదివిన వారూ సైబర్ వలలో చిక్కుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. మొదట తక్కువ పెట్టుబడికి లాభాలు ఇవ్వడంతో లక్షల్లో జమ చేస్తూ మోసపోతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. సులభంగా డబ్బు వస్తోందంటే అది మోసంగానే గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా కేసులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Cyber Crime: కొడితే బ్యాంకుల్నే కొట్టాలి!.. సైబర్ నేరగాళ్ల నయా ఎత్తుగడ