దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని పట్టుకున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. బిహార్‌లోని భగల్పూర్ జిల్లాకు చెందిన ఆరిఫ్‌తో పాటు ముకేశ్ పాషాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ముఠా పంజాబ్, హరియాణా, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన రాష్ట్రంలోనూ దొంగతనాలకు పాల్పడింది. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి ఆభరణాలను మెరుగు పెడతామంటూ మోసం చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
- సీపీ కమలాసన్‌రెడ్డి
నిందితుల వద్ద నుంచి 10 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఓ మోటార్ సైకిల్, మెరుగు పెట్టేందుకు ఉపయోగించే పౌడర్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. న్నారు. మిగతా ముగ్గురినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.