ETV Bharat / crime

ఆన్‌లైన్‌ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ఉచ్చులో 14వేల మంది మహిళలు - telanagana crime news

International sex racket and drug gang: అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ వేదికగా సాగుతున్న భారీ సెక్స్‌రాకెట్‌ గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్చులో 14వేల మందికి పైగా యువతులు, మహిళలు చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెబ్‌సైట్‌లు, కాల్‌సెంటర్ల ద్వారా దందా సాగిస్తున్న ఈ వ్యవహారంలో 17మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఓ ముఠా నాయకుడిని గుర్తించిన పోలీసులు.. అతని నుంచి తీగలాగితే నెట్టింట సాగుతున్న ఈ చీకటి తంతంగం వెలుగులోకి వచ్చింది.

Cyberabad Police
Cyberabad Police
author img

By

Published : Dec 6, 2022, 5:27 PM IST

Updated : Dec 6, 2022, 8:56 PM IST

International sex racket and drug gang: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 14వేల మందికి పైగా దేశవిదేశాలకు చెందిన యువతులు, మహిళలు. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిల ఫోటోలు, ఫోన్‌నంబర్లు. ప్రకటనలు, వెబ్‌సైట్లు, కాల్‌సెంటర్లు, వాట్సాప్‌ నుంచే సాగుతున్న వ్యవహారం. ఫోన్‌చేస్తే చాలు విమానాల్లో ప్రయాణాలు, హోటళ్లలో ఆతిథ్యాలు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్‌ వేదికగా సాగుతున్న భారీ వ్యభిచార ముఠా ఆటను సైబరాబాద్ పోలీసులు కట్టించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన మహిళలు, యువతులతో దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. ఎమ్​డీఎమ్​ఏ మాదకద్రవ్యాలు అలవాటు చేసి సెక్స్‌రాకెట్‌ను సాగిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా వెబ్‌సైట్లు, వాట్సప్‌ల ద్వారా ఈ ముఠా చీకటి దందాను నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. పలుప్రాంతాల్లో కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటు చేసి. ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు.

వ్యభిచార కూపాలపై దాడులు నిర్వహించే క్రమంలో తీగలాగితే ఈ వ్యవహారం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నిందితులతో పాటు హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన అర్నవ్‌ను ముఠా నాయకుడిగా గుర్తించినట్లు చెప్పారు. వీరిని విచారించగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న చీకటి తతంగం బయటపడిందని డీసీపీ కవిత వెల్లడించారు.

"ఈరోజు పట్టుకున్న వ్యభిచార ముఠాకు సంబంధించి మొత్తం 17 మందిని అరెస్టు చేశాం. వారిపై వివిధ సెక్షన్ల కింద 39 కేసులు నమోదుచేశాం. ఈ ముఠా ఉచ్చులో 14వేల 190 వరకు మహిళలు ఉన్నట్లు గుర్తించాం. వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీ, ముంబాయి, కోల్​కత్తా, అసోంతో పాటుగా విదేశీ మహిళలు కూడా ఉన్నారు".-స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ

"మేము రెండు నెలలు కిందట కొన్ని వ్యభిచార గృహాలపై దాడులు చేసి కొందరిని అరెస్టు చేశాం. ఆ తర్వాత వాటిని నిర్వహిస్తోన్న నిందితుల దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించాం. వారి సమాచారం మేరకు తెలుగు రాష్టాలతో పాటుగా వేరు రాష్ట్రాల్లో కూడా ఈ ముఠా నడుపుతున్న వారిని గుర్తించాం. ఈ ముఠాలో ఉన్నవారు వ్యభిచారంతో పాటు విటులకు డ్రగ్స్​ కూడా సరఫరా చేస్తున్నారు."-కవిత, డీసీపీ

హైదరాబాద్​లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముఠా ఉచ్చులో 14 వేల మంది మహిళలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 6, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.