ETV Bharat / crime

అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. మహిళ అరెస్ట్ - తెలంగాణ వార్తలు

ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్‌ ద్వారా పట్టుకున్నారు. ఉగాండా నుంచి ఇక్కడకు వచ్చిన మహిళ... లొక్యాంటో డేటింగ్ యాప్ ద్వారా ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి... మరో యువతిని కాపాడినట్లు వెల్లడించారు.

CP MAHESH BHAGWAT ON DATING APP CASE, CP MAHESH BHAGWAT ABOUT ONLINE DATING
అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టు రట్టు, వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
author img

By

Published : Jul 30, 2021, 7:29 PM IST

అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఉగాండాకు చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేసి... మరో ఉగాండా యువతిని కాపాడారు. ఉగాండా నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళ లొక్యాంటో డేటింగ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు... డెకాయి ఆపరేషన్‌ నిర్వహించి వారిని పట్టుకున్నారు.

ఉగాండాలోని మసకా కంపాలాకు చెందిన నంబీరు సైనా కొంత కాలంగా టోలీచౌకీలోని నిజాం కాలనీలో నివసిస్తోందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఉగాండా నుంచి వచ్చిన ఈ మహిళ యాప్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తోందని వెల్లడించారు. లొక్యాంటో డేటింగ్‌ యాప్‌ ద్వారా ఈ వ్యవహారం కొనసాగిస్తోందని... వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.8వేలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

లొక్యాంటో అనే డేటింగ్ యాప్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ముఠాను పట్టుకున్నాం. ఆఫ్రికన్ యువతుల ఫొటోలను పెట్టి... ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి రాగా... డెకాయి ఆపరేషన్ నిర్వహించాం. అందులో ఒక మహిళను అరెస్ట్ చేశాం. మరో యువతిని ఆమె బారినుంచి రక్షించాం. నంబీరు సైనా 2017లో ఉగాండా నుంచి విజిట్ వీసాతో దిల్లీకి వచ్చి... వీసా గడుపు పూర్తయినా భారత్‌లోనే ఉన్నారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి... టోలీచౌకీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఈ వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. ఫోన్ల ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. రూ.30 వేల నుంచి రూ.12 వేల వరకు విటుల నుంచి వసూలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి ఈమె దగ్గర ఉంటున్న యువతులు వీసా గడువు పూర్తయినా ఇక్కడే ఉంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

-మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్‌

అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టు రట్టు

పనితీరు భేష్

మానవ అక్రమ రవాణ విభాగాన్ని రాచకొండలో ప్రారంభించి ఏడాది పూర్తయిందని, ఈ విభాగంలో సిబ్బంది పనితీరును సీపీ మహేష్‌ భగవత్‌ ప్రశంసించారు. మానవ అక్రమ రవాణకు సంబంధించి గత ఐదేళ్లలో 353 కేసులు నమోదు చేసినట్టు సీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులపై ఇప్పటికీ 94 పీడీ చట్టాలు నమోదు చేసినట్టు వివరించారు. 514 మంది మేజర్లను, 149 మైనర్లను కాపాడినట్టు మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: అయ్యో పాపం... అడ్డొస్తున్నాడని పసివాడిని అమ్మమ్మే చంపేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.