ETV Bharat / crime

అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు ఏపీ పోలీసుల చెక్​ - podduturu latest news

చోరీలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఎవరూ లేని సమయంలో చోరీలకు పాల్పడతారు. దొంగిలించిన డబ్బుతో గోవా, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తారు. డబ్బులైపోగానే మళ్లీ చోరీలకు పాల్పడడం నిత్యకృత్యం. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు వారి ఆగడాలకు చెక్​ పెట్టారు.

inter state thieves arrested
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు పోలీసులు
author img

By

Published : Mar 27, 2021, 1:24 PM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు సంబంధం ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 20 లక్షలతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జనవరిలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా పరిధిలోని ఈశ్వర్​రెడ్డి నగర్​లో చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కచ్చితమైన సమాచారంతో తనిఖీలు చేపట్టి ద్విచక్రవాహనంపై జమ్మలమడుగు నుంచి కర్నూలుకు వెళుతున్న సద్దాం హుస్సేన్, మహబూబ్ బాషా, అబ్బాస్​లను విచారించగా వారు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. చోరీ సొత్తును అనంతపురానికి చెందిన జొన్నగడ్డ పుల్లా నాయుడు ద్వారా అమ్ముతున్నట్లు చెప్పారు.

నమ్మకంగా పనిచేస్తూ...

టూటౌన్ ప‌రిధిలో ఓ బంగారు వ్యాపారి వ‌ద్ద కార్మికుడు 30 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో మ‌హారాష్ట్రలోని సోలాపూర్‌కు చౌహాన్ రైలులో వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా టూటౌన్ పోలీసులు ఎర్ర‌గుంట్ల రైల్వే స్టేష‌న్‌లో అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: యథేచ్చగా ఇసుక దందా... అడ్డుకుంటున్న అధికారులపై దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.