ETV Bharat / crime

cyber crime Hyderabad news today : ఇయర్‌ఫోన్స్‌ కొంటే.. రూ.33 లక్షలు దోచేశారు - Insurance Money stolen by cyber criminals

cyber crime Hyderabad news today : ఏడాది కిందటే అనారోగ్యంతో భర్త మరణించాడు. ముగ్గురు పిల్లలు, భార్య నిరక్షరాస్యులు. అప్పటివరకు కాలు బయటపెట్టలేదు. ఈ స్థితిలో ఆ కుటుంబానికి ఆయన బీమా డబ్బులు భరోసానిచ్చాయి. అంతా సర్దుకుంటుందనుకున్న తరుణంలో రూ.99తో కొన్న ఇయర్‌ఫోన్స్‌ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. ఏకంగా రూ.33 లక్షలు సైబర్‌ నేరగాళ్లు లాగేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. కేసును సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

cyber crime Hyderabad news today
cyber crime Hyderabad news today
author img

By

Published : Nov 23, 2021, 10:06 AM IST

cyber crime Hyderabad news today : మౌలాలీలో ఉండే ఓ వ్యక్తి(32) లేబర్‌ క్రాంటాక్టర్‌గా పనిచేస్తుండేవారు. గతేడాది నవంబర్‌లో అనారోగ్యంతో మరణించారు. బీమా సంస్థ నుంచి ఆయన కుటుంబానికి రూ.50 లక్షలు అందాయి. ముగ్గురు పిల్లలపై తలా రూ.10 లక్షల చొప్పున భార్య ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించింది. తన దగ్గరున్న, మిగతా డబ్బును రెండు బ్యాంక్‌ ఖాతాల్లో(ఒకదాంట్లో రూ.28 లక్షలు, మరో ఖాతాలో రూ.5 లక్షలు) జమ చేసింది. 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్‌లైన్‌ క్లాస్‌లను వినేందుకు హెడ్‌ఫోన్‌ కావాలని అడిగింది. ఆన్‌లైన్‌లో కొంటానంటే ఫోన్‌ ఇచ్చింది. అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో వాటి ధర రూ.500 నుంచి రూ.600 వరకు ఉంది. ఓ వెబ్‌సైట్‌లో రూ.99కే ఇయర్‌ఫోన్స్‌ అంటూ మెసేజ్‌ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది. వస్తువును ఇంటికి తెచ్చిచ్చారు.

వరుసగా 15 రోజుల్లో ఖాళీ..

Insurance Money stolen by cyber criminals : కొన్ని రోజుల తర్వాత ఆమె మరికొంత డబ్బును జమ చేసేందుకు బ్యాంక్‌కి వెళ్లారు. బ్యాలెన్స్‌ ఎంతుందని అడగ్గా సున్నా ఉందని చెప్పారు. రూ.5 లక్షలుండాలి కదా అని నిలదీస్తే మాకేం తెలియదంటూ సిబ్బంది వివరించారు. మరో ఖాతా పరిశీలనకు వేరే బ్యాంక్‌కి వెళ్లారు. రూ.28 లక్షలుండాల్సిన ఖాతాలో రూపాయి లేదని తెలుసుకుని కంగుతిన్నారు. వెంటనే రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించగా, ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్‌ కేటుగాళ్లకు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు. ఆమె అవగాహనలేమి వారికి కలిసొచ్చినట్లుగా గుర్తించారు.

కొల్లగొట్టారిలా..

Insurance Money loot by cyber criminals : ఇయర్‌ఫోన్స్‌ కొన్నందుకు మీకు లాటరీ తగిలిందని ఆ వెబ్‌సైట్‌ నుంచి అశోక్‌ కాల్‌ చేశాడు. రూ.15 లక్షల విలువ చేసే కారును గెలుచుకున్నట్లు చెప్పాడు. కారు వద్దనుకుంటే డబ్బు తీసుకోవచ్చని నమ్మించాడు. ఎస్‌ఎంఎస్‌లో ఉన్న లింక్‌ క్లిక్‌ చేసి బహుమతి డబ్బును జమ చేసేందుకు బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేయమని సూచించాడు. ఆమె నిరక్షరాస్యురాలు కావడంతో ఫోన్‌ తన కుమార్తెకు ఇచ్చారు.

Hyderabad Cyber crimes today 2021 : సైబర్‌నేరస్థులు చెప్పినట్లుగా ఆ బాలిక ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసింది. బ్యాంక్‌, డెబిట్‌ కార్డులు, ఓటీపీ ఇతరత్రా వివరాలను చెప్పింది. ఈ సమాచారం ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ రిజిస్టర్‌ చేసుకుని ముందుగా ఫోన్‌ నంబర్‌ మార్చేశారు. గూగుల్‌పే, ఫోన్‌పేను తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని పదుల సంఖ్యలో ఖాతాలకు డబ్బులను బదిలీ చేసినట్లు గుర్తించారు. బిహార్‌ కేంద్రంగా ఇదంతా జరిగింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.