ED on Indus Viva Health Sciences assets : ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక జప్తు చేసింది. సుమారు రూ.1500 కోట్ల మల్టీ లెవెల్ మార్కెటింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగంపై సంస్థతో పాటు... ఛైర్మన్ సీఏ అంజార్, సీఈఓ అభిలాష్ థామస్‌కు చెందిన రూ.66 కోట్ల 30 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఇండస్ వివాపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీలాండరింగ్ నేరం ద్వారా కూడబెట్టుకున్న రూ.50 కోట్ల స్థిరాస్తులతో పాటు 20 బ్యాంకు ఖాతాల్లోని రూ.15 కోట్ల 83 లక్షలు అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇండస్ వివా ఛైర్మన్ సీఏ అంజార్, అభిలాష్ థామస్‌లను డిసెంబరులో ఈడీ అరెస్టు చేసింది.
డ్రగ్స్ తయారీకి రసాయనాల సరఫరా
ED on Hygro chemicals pharmatech : మరో కేసులో మాదక ద్రవ్యాల తయారీలో ముడిపదార్థంగా వినియోగించే రసాయనాలను అక్రమంగా ఉత్పత్తి చేసిందన్న అభియోగంపై హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సొమ్మును ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్ బొల్లారంలోని హైగ్రో కెమికల్స్‌పై గతంలో డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతోంది. డీపీపీహెచ్సీఎల్ అనే రసాయనిక పదార్థాన్ని 2004 నుంచి 2006 వరకు అక్రమంగా దిల్లీలోని జేకే ఫార్మా ఏజెన్సీస్‌కు తరలించిందని డీఆర్ఐ, ఈడీ అభియోగం. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ... హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్కు చెందిన రూ.కోటి 93 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది.
ఇదీ చదవండి: భార్య పోర్న్ వీడియోలతో ఆనందం.. అదే డబ్బు సంపాదన మార్గం.. చివరకు..