ETV Bharat / crime

50 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులు అరెస్ట్​

author img

By

Published : May 1, 2021, 5:34 PM IST

మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి, వాహనం, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

marijuana seized
గంజాయి స్వాధీనం

ఏపీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్​ పాతబస్తీ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరినీ టాస్క్​ఫోర్స్, ఫలక్​నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 కేజీల గంజాయి, ఒక ఇన్నోవా కారు, 2 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఎండీ ఖాదర్, ఎండీ అజిజ్ ఇద్దరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించేందుకు పథకం వేశారు.

విశాఖపట్నం నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు, ఫలక్​నమా పోలీసుల సహాయంతో వారిని పట్టుకున్నారు. గంజాయి స్వాధీనం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న టాస్క్​ఫోర్స్ సీఐ రాఘవేంద్ర, సిబ్బందిని అదనపు డీసీపీ చక్రవర్తి అభినందించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం.. విలువైన సామాగ్రి దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.