ETV Bharat / crime

'ఆ ముగ్గురు నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలి' - Terrorists plan Dussehra blasts in Hyderabad

Terrorist conspiracy case update: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఉగ్ర కుట్రలకు సంబంధించి పూర్తిగా తెలుసుకోవడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

'ఆ ముగ్గురు నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలి'

author img

By

Published : Oct 10, 2022, 3:42 PM IST

Terrorist conspiracy case update: హైదరాబాద్‌లో దసరా సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 7న దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు వాదనలు జరిగాయి. కేసులో ప్రధాన నిందితుడు జాహెద్, సమీయుద్దీన్, మజాన్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

నిందితులు ముగ్గురూ కలిసి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని సిట్ అధికారుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హ్యాండ్ గ్రనేడ్లను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని.. హవాలా మార్గంలో పాక్ నుంచి డబ్బులను తీసుకున్నారని కోర్టుకు వివరించారు. యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేలా ముగ్గురు నిందితులు వ్యవహరిస్తున్నారని.. వీరి కుట్రల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

ఇవీ చూడండి..

హైదరాబాద్​లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్టు​.. పాకిస్థాన్ గ్రనేడ్లు స్వాధీనం

దసరా పేలుళ్ల ప్లాన్​ భగ్నం.. హవాలా మార్గంపై దర్యాప్తు..

పోలీసులకు పట్టించిందని మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పిన దొంగ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.