ETV Bharat / crime

డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. ఇంకా దొరకని నవీన్ రెడ్డి - Hyderabad Dentist Kidnap case updates

Naveen Reddy Arrest
Naveen Reddy Arrest
author img

By

Published : Dec 10, 2022, 11:56 AM IST

Updated : Dec 10, 2022, 3:00 PM IST

06:12 December 10

డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు.. ఇంకా దొరకని నవీన్ రెడ్డి

Naveen Reddy Arrest in Dentist Kidnap Case : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఇంకా దొరకలేదు. అతనికి సహకరించిన 20 మందిని మాత్రం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే శుక్రవారం రోజున 8 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నవీన్‌రెడ్డి క్రియేట్ చేసిన నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌పై ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. అతడితో పాటు రఘుమా రెడ్డి, మరో వ్యక్తిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు ఆదిభట్ల పోలీసులు వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ వివరాలు సేకరించిన సీఐ చెప్పారు.

సంబంధిత కథనం : నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్‌.. 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

అసలేం జరిగిందంటే.. తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చయ తాంబూలాలకు ముహూర్తమని నవీన్‌ రెడ్డికి తెలిసింది. పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకు పోయాడు. సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటన జరిగిన 6 గంటలలోపే పోలీసులు అమ్మాయిని రక్షించారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఇవాళ మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Dec 10, 2022, 3:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.