ETV Bharat / crime

భార్యను అలా చూసి కోపోద్రిక్తుడైన భర్త.. పెట్రోల్​ పోసి నిప్పంటించి.. - హైదరాబాద్​లో భార్యపై భర్త పెట్రోల్ దాడి

Husband burnt wife alive in Hyderabad : భార్యపై భర్త పెట్రోల్​ పోసి నిప్పుపెట్టి హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్​ నగరంలో చోటుచేసుకుంది. అతని భార్య వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Husband tried to kill his wife by petrol Attack
పెట్రోల్ దాడి
author img

By

Published : Nov 8, 2022, 1:55 PM IST

Husband burnt wife alive in Hyderabad : హైదరాబాద్​ నగరంలోని దారుణం జరిగింది. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య ఆమె ప్రియుడిపై భర్త హత్యా యత్నం చేశాడు. నారాయణగూడ వంతెన కింద పూలు అమ్ముకుని నాగుల సాయి, ఆర్తి దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

కొద్దిరోజులుగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే నాగరాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినలేదు. ఆమెపై కోపం పెంచుకున్న భర్త ఎలా అయినా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి నారాయణగూడలోని నివాసం ఉంటున్న ఆర్తి ఇంటికి వెళ్లాడు.

అప్పటికే ఆమె ప్రియుడితో పాటు ఉండడాన్ని గ్రహించి.. తన పది నెలల కుమారుడితో సహా వారిపై పెట్రోల్​ పోసి చంపడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఆ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రగాయాలైన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్తి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నాగసాయి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.