యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త అర్ధరాత్రి భార్యపై రోకలితో దాడిచేసి చంపాడు. భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాకు చెందిన పోనుగోతు లచ్చు(లక్ష్మణ్), సునీతలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. లక్ష్మణ్ మద్యానికి బానిసై ప్రతిరోజు తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడని స్థానికులు తెలిపారు.
సోమవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన లక్ష్మణ్ భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సునీతపై రోకలితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన సునీత అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో లక్ష్మణ్ పరారయ్యాడు.
తెల్లవారుజామున స్థానికులు చూసే సరికి సునీత రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉంది. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: కుమారున్ని బావిలో తోసి చంపిన తల్లి