Extramarital Affairs: భర్తతో మరో యువతి సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఓ వివాహిత.. కిరాయి వ్యక్తులతో సదరు యువతిపై అతి కిరాతకంగా లైంగిక దాడికి ప్రేరేపించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘాతుకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మరో చోట.. భార్య వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిన భర్త.. ఆగ్రహంతో ఇరువురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో అల్లిపురానికి చెందిన వీరబాబు భార్యతో... అదే ప్రాంతానికి చెందిన నవీన్ అనే యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి విషయం తెలిసిన భర్త.. పలుమార్లు భార్యకు నచ్చజెప్పేందుకు యత్నించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. అనేక సార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టించాడు. వారి సలహాతో దంపతులు ఇటీవల ఖమ్మం శివారులోని గోపాలపురానికి మకాం మార్చారు. అయినా తీరు మార్చుకోని నవీన్... ఆదివారం రాత్రి వీరబాబు ఇంటికి వెళ్లాడు.
ఆటో డ్రైవర్ అయిన వీరబాబు అదే సమయంలో ఇంటికి వెళ్లగా... అతని భార్య, నవీన్ ఏకాంతంగా కనిపించడంతో వీరబాబు ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే కత్తితో వారిపై దాడి చేశాడు. ఘటనలో నవీన్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన ఇరుగుపొరుగు.. వెంటనే అతడిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: suspected death: అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అనుమానాస్పదస్థితిలో మృతి..!