వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో రెండు భారీ కంటైనర్ లారీలు బీభత్సం సృష్టించాయి. ఇల్లందులో జాతీయ రహదారి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలను తగిలి అలాగే ముందుకు దూసుకెళ్లడంతో.. రోడ్డుకు ఇరువైపుల ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో గ్రామంలోని గృహోపకరణాలు కాలిపోయాయి.
ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. ఘటన స్థలానికి చేరుకుని కంటైనర్లను అడ్డుకున్నారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. కంటైనర్ను అజాగ్రత్తగా ఎలా నడిపారంటూ వారిపై మండి పడ్డారు. పాడైన గృహోపకరణాలకు నష్ట పరిహారం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. స్థానికుల సమాచారంతో.. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్