ETV Bharat / crime

ఆస్పత్రిలో యువతికి లైంగిక వేధింపులు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

Sexual Harassment in the hospital : రోగులు, వారి సహాయకులకు రక్షణగా ఉండాల్సిన సిబ్బందే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటన కర్నూలు సర్వజన వైద్యశాలలో శనివారం చోటుచేసుకొంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Sexual Harassment in the hospital
Sexual Harassment in the hospital
author img

By

Published : Jul 13, 2022, 12:40 PM IST

Sexual Harassment in the hospital : యువతిపై సెక్యూరిటీ గార్డు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేసి లొంగదీసుకోవాలని ప్రయత్నించగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చివరికి అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన ఓ యువతి కుటుంబసభ్యులు టీబీ వార్డులో చేరడంతో ఆమె సహాయకురాలిగా ఉన్నారు. ఈ వార్డు వద్ద సెక్యూరిటీ గార్డు సంతోష్‌కుమార్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ యువతి తన స్నేహితుడితో తిరగడాన్ని గమనించాడు.

ఒక రోజు ఆమె వద్దకెళ్లి బ్లాక్‌మెయిల్‌ చేసి బెదిరించాడు. నీ స్నేహితుడిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పగా ఆమె భయపడింది. తన ద్విచక్ర వాహనంపై పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పడంతో ఆమె అతనితో వెళ్లింది. అతను బయట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లకుండా కొన్ని గంటల తర్వాత తిరిగి ఆస్పత్రి వద్ద దించి వెళ్లాడు. దీనిపై బాధితురాలు సెక్యూరిటీ పర్యవేక్షకుడు నాయుడుకు ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడని, అసభ్యకరంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో అతడిని సోమవారం ఉద్యోగంలో నుంచి తొలగించారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పగా తన పరువు పోతుందని చెప్పడంతో చివరికి ఆసుపత్రి అధికారులు గుత్తేదారుడి దృష్టికి తీసుకెళ్లారు.

పలువురికి నేరప్రవృత్తి.. ఆసుపత్రిలో కొందరు నేరప్రవృత్తి ఉన్న రక్షణ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గుత్తేదారు వారి ప్రవర్తన గురించి తెలుసుకోకుండా డబ్బులకు ఆశపడి ఉద్యోగాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ పర్యవేక్షణ అధ్వానంగా ఉంది. ఆసుపత్రిలో ఓ అధికారే గుత్తేదారుడికి కొంత పర్సంటేజీ ఇచ్చి బినామీ పేరుతో బిల్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు గుత్తేదారుడికి అర్హత లేకున్నా ఓ ప్రజాప్రతినిధి కాంట్రాక్టు ఇప్పించారని తెలిసింది.

గతంలోనూ ఇలానే.. : డోన్‌కు చెందిన సంతోష్‌కుమార్‌ ఏడాది కిందట పెద్దాస్పత్రిలో గార్డుగా చేరాడు. ఇతనే కాదు.. చాలా మంది ఈ ఉద్యోగం కోసం గుత్తేదారుడి వద్ద పనిచేస్తున్న కొందరు ఏజెంట్లు ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్స్‌లెంట్‌ సర్వీసెస్‌ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రి సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్నారు. అతను ఏజెంట్ల ద్వారా రూ.లక్షలు వసూలు చేశారన్న విమర్శలున్నాయి. ఆసుపత్రిలో ఒక్క సంతోష్‌కుమారే కాదు.. నాలుగేళ్ల కిందట క్యాన్సర్‌ వార్డులో ఓ రోగి సహాయకురాలితో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఇలానే ప్రవర్తించారు. ఆ సమయంలో వారిపై కేసులు పెట్టకుండా ఉద్యోగాల నుంచి తొలగించి చేతులు దులిపేసుకున్నారు. విషయం పెద్దదవడంతో చివరికి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

ఫిర్యాదులు రావడంతో: "తన పట్ల సంతోష్‌కుమార్‌ అసభ్యకరంగా ప్రవర్తించారని, తనను బెదిరించి డబ్బులు అడిగారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో విషయాన్ని ఏఆర్‌ఎంవో దృష్టికి తీసుకెళ్లాం. మా ఎండీ దృష్టికి తీసుకెళితే తొలగించమని చెప్పడంతో విధుల నుంచి తీసేశాం. ఫిర్యాదు చేయమని చెప్పగా వద్దని అనడంతో ఫిర్యాదు చేయలేదు."- నాయుడు, సెక్యూరిటీ పర్యవేక్షకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.