ETV Bharat / crime

చావులోనూ వీడని రక్తసంబంధం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వైద్యులు మృతి

వారిద్దరూ అన్నదమ్ములు. బిహార్​ నుంచి హైదరాబాద్​కు వలస వచ్చి హోమియో వైద్యులుగా ఒకే వృత్తిలో స్థిరపడ్డారు. కానీ వారిద్దరి రక్త సంబంధాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. మృత్యు రూపంలో వారిని కాటేసింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నదమ్ములిద్దరూ ఒకేసారి మృత్యు ఒడికి చేరారు. ఈ విషాద ఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా శామీర్​పేటలో చోటుచేసుకుంది.

homeo doctors died
హోమియో వైద్యులు మృతి
author img

By

Published : Jun 21, 2021, 1:09 PM IST

హోమియోపతి వైద్యులుగా పనిచేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా శామీర్​ పేట్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్​కు చెందిన గౌతమ్​(28), నందన్​(26) అల్వాల్​లోని ఎక్సెల్​ ఆస్పత్రిలో హోమియోపతి వైద్యులుగా పనిచేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం శామీర్​పేట్​లోని పెద్ద చెరువు వద్దకు అన్నదమ్ములు బైక్​పై వెళ్లారు. నందన్​ కాళ్లు కడుక్కునేందుకు అందులో దిగగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయారు. అతనిని రక్షించేందుకు గౌతమ్​ ప్రయత్నిస్తూ అతనూ పడిపోయాడు. చెరువు వద్ద వారి బైక్​, బ్యాగ్​ గమనించిన వైద్యుల స్నేహితుడు గణేష్​ వర్మ.. వారిద్దరూ గల్లంతయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెతికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్​ పేట్​ సీఐ సుధీర్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి: ముగ్గుర్ని నరికి చంపిన కేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.