పెళ్లి గురించి.. కాబోయే భార్య గురించి అందరి యువకుల్లాగే అతనూ ఎన్నో కలలు కన్నాడు. తనకు నచ్చిన అమ్మాయినే ప్రేమించి పెళ్లాడాలని(love marriage) ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అప్పటి నుంచి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ రోజులో భాగమైపోయాయి. ఆమె ఫోన్‌తోనే నిద్రలేచేవాడు.. ఆమె గుడ్‌నైట్ చెప్పాకే పడుకునేవాడు. ఆమె లేని జీవితం ఊహించలేనని అర్థమైన అతడు.. వారి ప్రేమను పెళ్లిపీటలెక్కించేందుకు ఇరువైపులా పెద్దలను ఒప్పించాడు. కొద్దిరోజులైతే వివాహం బంధంతో ఒక్కటవుతామని ఎంతో ఆనందపడ్డాడు.
అంతా సవ్యంగా జరుగుతున్న క్రమంలో.. ఆ యువతి ఫోన్ చేయడం మానేసింది. కొద్దిరోజులుగా తనతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏమైందోనని ఆరా తీస్తే.. తరచూ అనారోగ్యానికి(fiance fell sick) గురవుతోందని తెలిసింది. తానే స్వయంగా ఆమెను ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. కానీ ఏ డాక్టర్ ఆమె సమస్యేంటో చెప్పలేకపోయారు. చివరకు యువతి కుటుంబ సభ్యులు ఆమెను ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు. ఆ బాబా చెప్పిన విషయాలు విని ఆమె వారు ఖంగుతిన్నారు. బాబా చెప్పిన మాటలు యువకుడికి చెప్పారు. అది విని యువకుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనకు కాబోయే జీవితభాగస్వామి అనారోగ్యానికి తన కుటుంబమే కారణమని తెలిసి అతడు కోపోద్రిక్తుడయ్యాడు. చివరకు వాళ్ల చేతిలోనే అంతమయ్యాడు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ ఫయీన్బాగ్కు చెందిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ షోయెబ్(32).. ఓ యువతి.. జనవరిలో ప్రేమ పెళ్లి(love marriage) చేసుకోబోతున్నారు. యువతి తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఆమె కుటుంబీకులు ముంబయిలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చి.. ఆరిఫ్ బంధువులే క్షుద్రపూజలు(black magic) చేయిస్తున్నారని బాబా చెప్పినట్లు ఆరిఫ్‌కు తెలిపారు.
ఆరిఫ్ నవాబ్‌సాబ్‌కుంట షాహీన్‌నగర్‌లో నివసించే తన సోదరిని అనుమానించాడు. ఈ విషయమై సోదరితోపాటు హుస్సేనీఆలం ఠాణాలో హోంగార్డుగా పనిచేస్తున్న ఆమె భర్త మహ్మద్ సమీ మొహియుద్దీన్(32)తో గొడవ పడ్డాడు(man fought with his brother in law). ప్రేయసికి చికిత్స చేయించడానికి రూ.2లక్షలు ఇవ్వాలని వారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. రూ.50 వేలు ఇచ్చినా ఊరుకోలేదు. ఇక లాభం లేదని.. తన బావమరిది పరిధి దాటి ప్రవర్తిస్తున్నాడని సమీ మొహియుద్దీన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆరిఫ్‌ను అంతం చేయాలని(home guard wants to kill his brother in law) నిర్ణయించుకున్నాడు. తన సోదరుడు మహ్మద్ అమ్జద్ మొహియుద్దీన్(25), షాహీన్‌నగర్‌కు చెందిన బైక్ మెకానిక్ మహ్మద్‌అలీ(21), అచ్చిరెడ్డినగర్‌కు చెందిన దుస్తుల వ్యాపారి ఆమేర్ మహ్మద్‌ఖాన్(26)తో కలిసి పథకం రచించాడు.
ఈనెల 13న రాత్రి 11 గంటల ప్రాంతంలో గొడ్డలి, కత్తులతో ఆరిఫ్పై దాడిచేసి(man killed his brother in law in Hyderabad) పరారయ్యారు. కుటుంబీకులు ఆరిఫ్‌ను ఉస్మానియాకు తరలించగా, ఆరోజు రాత్రి చనిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హోంగార్డు మహ్మద్ సమీని సర్వీసు నుంచి తొలగిస్తామని డీసీపీ తెలిపారు.