ETV Bharat / crime

Jubileehills Gang Rape Case : నిందితుల డీఎన్​ఏ సేకరణకు కోర్టు అనుమతి

Jubileehills Gang Rape Case
Jubileehills Gang Rape Case
author img

By

Published : Jun 27, 2022, 10:19 AM IST

Updated : Jun 27, 2022, 10:47 AM IST

10:14 June 27

జూబ్లీహిల్స్​ గ్యాంగ్​రేప్​ కేసు నిందితుల డీఎన్​ఏ సేకరణకు కోర్టు అనుమతి

Jubileehills Gang Rape Case :హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల డీఎన్​ఏ సేకరించడానికి పోలీసులు కోర్టును అనుమతి కోరగా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుల నుంచి పోలీసులు డీఎన్​ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపనున్నారు. ఇప్పటికే.. అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు. డీఎన్​ఏ సేకరించిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు.

నిందితులు ఇన్నోవా వాహనంలోనే ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించడానికి డీఎన్​ఏ టెస్ట్ ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే బాధితురాలి డీఎన్​ఏను సేకరించే యోచనలో ఉన్నారు. మే 28న మైనర్ బాలికను సాదుద్దీన్ సహా మరో ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు.

ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్​ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అందర్ని కొన్ని రోజుల పాటు రిమాండ్​లో ఉంచి విచారించారు. ప్రస్తుతం సాదుద్దీన్ చంచల్​గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jun 27, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.