ETV Bharat / crime

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్‌

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో బలగాలు తనిఖీలు చేపడుతున్నాయి. గోదావరి దాటి ప్రవేశించే అవకాశాలుండటంతో ప్రత్యేక నిఘా ఉంచారు. వాహన తనిఖీలు చేపట్టి అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

High alert, telangana state border
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్
author img

By

Published : Apr 6, 2021, 10:30 AM IST

ఛత్తీస్‌గఢ్‌ భారీ ఎన్​కౌంటర్​తో.. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేపడుతున్నాయి. ప్రధానంగా గోదావరి దాటి.... ఈ జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలుండటంతో.. సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

గత 4 నెలల నుంచి.. ఈ ప్రాంతంలో మావోయిస్టుల యాక్షన్ టీం సంచారం కదలికలతో... నిఘా పటిష్టం చేయగా.. తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​ని పురస్కరించుకుని.. బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. కన్నాయ్ గూడెం, ఏటూరునాగారం, వాజేడు.. వెంకటాపురం, మంగపేట అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ ​కు ఆనుకుని ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలోని.. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో మరింత ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

గోదావరి దాటేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో.. గస్తీ పెంచారు. ఇటు గోదావరి తీరం, అటవీ ప్రాంతాలతో పాటు.. మైదాన ప్రాంతాల్లోనూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వస్తున్న వాహనాలను సోదా చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు​.. జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.