Ganja Gang Arrest: మహిళలకు కమీషన్ ఆశజూపి వారి సాయంతో గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 470 కిలోల గంజాయి, నాలుగు కార్లు, 11 చరవాణీలు, రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ ఆయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు.
ప్రధాన నిందితులు శ్రీకాంత్, రాహుల్ పలు రాష్ట్రాల్లో ఉన్న డీలర్లతో సంబంధాలు పెట్టుకుని గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి గ్రామం నుంచి నాలుగు వాహనాల్లో 470 కిలోల గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చిన నిందితులు... మహారాష్ట్ర తరలించేందుకు యత్నించారు. నలుగురు నిందితులు వేరే కారులోకి గంజాయి మారుస్తున్న సందర్భంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపుగా అర క్వింటాల్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిచ్చిన సమాచారంతో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Bride Death Case: పెళ్లి ఆపాలనుకుంది... కానీ ప్రాణమే పోయింది...